కుర్తాళం పీఠాధిపతి అయి సర్వసంగ పరిత్యాగి కావాలనుకున్న పి.వి.నరసింహారావు 1991లో ఒక చారిత్రక అవసరంగా ప్రధానమంత్రి పదవిని ఎలా చేపట్టాల్సి వచ్చింది?

దేశ రూపురేఖలను మార్చేసిన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టిన పి.వి. విదేశీ శక్తులకు తాకట్టుపడాల్సిన దుస్థితి నుంచి దేశాన్ని ఎలా రక్షించారు. ఆయన తీసుకున్న కీలక నిర్ణయాలేమిటి?

పంజాబ్‌, కశ్మీర్‌ వంటి అంతర్గత సమస్యలపై దృష్టి కేంద్రీకరిస్తూనే అగ్రదేశాలతో సంబంధాల్ని ఎలా పునరుద్ధరించారు? అణు పరీక్షలకు ఎలా రంగం సిద్ధం చేశారు?

అడుగడుగునా ఇంటా, బయటా ప్రత్యర్థులు సృష్టించిన గండాలను గట్టెక్కి అయిదేళ్ల పాటు మైనారిటీ ప్రభుత్వాన్ని ఎలా నిర్వహించగలిగారు? ఆయనకు సహకరించిన కనపడని శక్తులు ఎవరు?

రామజన్మభూమి ఉద్యమం రగలడానికి, బాబ్రీ కూల్చివేతకు దారితీసిన పరిణామాలేమిటి? అడ్వాణీ పాత్ర ఏమిటి? నరేంద్ర మోదీ ఎదుగుదల పి.వి. హయాంలోనే ప్రారంభమైందా?

పి.వి. కాలంలో జరిగిన కుంభకోణాలు పూర్తిగా బూటకమైనవా? వాటి నుంచి ఆయన ఎలా బయటపడ్డారు? చంద్రస్వామిని పి.వి. ప్రోత్సహించారా?

పి.వి. చివరిలో ఎలా నిరాదరణకు గురయ్యారు? ఆయన భౌతికకాయాన్ని కూడా ఎందుకు అవమానించారు?

కోట్ల, వైఎస్‌  మధ్య నాడు రాజకీయ ఘర్షణలు ఎలా ఉండేవి? వై.ఎస్‌. ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయారు? సాహితీ పిపాసి అయిన పి.వి.లో ఒక తిరుగుబాటుదారుడు ఉన్నాడా?

తెలుగుబిడ్డ, దేశానికి తొలి దక్షిణాది ప్రధాని, అపర చాణక్యుడు, తిరుగులేని దేశ భక్తుడు అయిన పి.వి. నరసింహారావు గురంచి అత్యంత ఉత్కంఠ భరితంగా ప్రముఖ జర్నలిస్టు ఎ.కృష్ణారావు స్వానుభవంతో రాసిన కథనం ఇది.

పేజీలు : 224

Write a review

Note: HTML is not translated!
Bad           Good