వినియోగదారుడే నిజమైన రాజు ! రా రాజు ! అనేది ఆర్యోక్తి దీనికి ప్రధాన కారణం వినియోగదారుని మన్నిక, విశ్వాసాల పొందని ఏ వస్తువు లేదా సేవ వాణిజ్య విపణిలో తమ మనుగడను సాగించడం అసాధ్యం. వాణిజ్య విఫణిలో లభ్యమయ్యే వస్తు సేవలకు ప్రధాన భూమిక వినియోగదారుడే నన్నది మనకందరికీ తేటతెల్లమే కాని వినియోగదారుని కొనుగోలు మరియు ఎంపిక నిర్ణయాలను తీవ్రంగా ప్రభావితం చేసే వివిధ రకాలైన అనుచిత, అనైతిక నిర్భంద వ్యాపార పద్దతులను వస్తు, సేవల తయారీదారులు, సరఫరా దారులు అమ్మకందారులు నిరంతరంగా అవలంబిస్తూ , వినియోగదారులు, హక్కులను ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారనేది యదార్ధం.
చాలా సందర్భాలలో మోసానికి గురైన వినియోగదారుడు ఎప్పుడు, ఎక్కడ తన ఫిర్యాదును దాఖలు చేసి న్యాయాన్ని పొందవచ్చు ? అనే విషయాల పై సరైన సమాచారం లేక తనను తానూ నిందించుకోవడం పరిఆతి అయ్యింది. కర్మ సిద్దాంతాన్ని నమ్మే మన దేశ ప్రజలు ఇది అనాదిగా వస్తున్న ప్రక్రియే ! ఇటువంటి అచేతన పరిస్థితి నుంచి వినియోగదారుడు బయట పడాలంటే ఒకే ఒక మార్గం తనను తానూ చైతన్య పరచుకుని తన హక్కుల పరిరక్షణకు నడుం బిగిస్తూ తన బాధ్యతలను కూడా సమాన ద్రుష్టి తో నెరవేర్చాలి. వినియోగదారులు చేసే ఆ ప్రయత్నంలో నా ఈ చిరు ప్రయత్నం ఈ చిన్న పుస్తకం రూపంలో ఉపకరిస్తుందని ఆశిస్తూ...

Write a review

Note: HTML is not translated!
Bad           Good