ఫాలోఫ్రెయిరె రచించిన ఈ పుస్తకం కొన్ని దశాబ్దాలుగా ప్రపంచంలోని ప్రామాణిక రచనలలో ఒకటిగా వెలుగొందుతున్నది. కేవలం విద్యా బోధనకే గాక ప్రజల విముక్తి కోసం పోరాడే వాళ్ళ వైఖరి ఎలా వుండాలో అమోఘంగా వివరిస్తుంది. పీడక సమాజంలో పీడనకు గురవుతున్న వాళ్ళ మనస్తత్వాలలో వచ్చే మార్పును విశ్లేషిస్తుంది. పీడితులు తమ స్థితిని గుర్తించి మార్పుకోసం పోరాడే చైతన్యం సంతరించుకోవాలంటే వారితో సంభాషణ తప్ప మార్గం లేదని సంభాషణా సంస్సృతిని ప్రబోధిస్తుంది. వర్గ సమాజంలో ప్రగతి శీలులైన ప్రతివారి అనుభవాలను కళ్ళకు గట్టే అమూల్య గ్రంథమిది. తెలుగులో సంపూర్ణ అనువాదం రావడం ఇదే ప్రథమం. |