Rs.75.00
In Stock
-
+
మహత్తర అక్టోబర్ కార్మిక విప్లవం సరిగ్గా వందేళ్ల క్రితం 1917 నవంబర్ నెలలో జరిగింది. దానికి ముందు అనేక విప్లవాలు జరిగాయి. ఆ తరువాత జరుగుతూనే ఉన్నాయి. ఈ అక్టోబర్ విప్లవానికి ఉన్న ప్రత్యేకతను ఒక్క మాటలో చెప్పాలంటే వందేళ్ల క్రితం ప్రపంచానికీ నేటి ప్రపంచానికీ ఉన్న వ్యత్యాసాలను ఆవిష్కరించింది ఆ విప్లవం. ఈ వందేళ్లుగా జరుగుతున్న ప్రతి పరిణామంపైనా ఆ విప్లవం ప్రభావం కనపడుతూనే ఉందనడం అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. అందువలన ఆ విప్లవం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. నాటి చారిత్రక పరిణామాలన్నింటినీ విశ్లేషిస్తూ, వివరిస్తూ అనేకమంది కమ్యూనిస్టు అగ్రనాయకులు, మార్క్సిస్టు మేధావులు రాసిన వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం.
పేజీలు : 104