ఆచార్య కొలకలూరి ఇనాక్ రచించిన సాహిత్య విమర్శ గ్రంథం 'విమర్శిని'కి 2018 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయనకు ఆరు దశాబ్దాల సాహిత్య జీవితముంది. ఆయన కవి, కథకుడు, నవలాకారుడు, నాటక రచయిత, పరిశోధకుడు, విమర్శకుడు, మంచి వక్త. 'తెలుగు వ్యాస పరిణామం' అంశం మీద పరిశోధన చేశారు. సాహిత్య పరామర్శ, ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం, జానపదుల సాహిత్య విమర్శ, సూద్ర కవి శంభుమూర్తి వశుచరిత్ర వైశిష్ట్యం, సాహిత్య దర్శిని, పత్రత్రయి మొదలైన విమర్శ గ్రంథాలు ప్రచురించారు.
కొలకలూరికి తెలుగు జానపద, ప్రాచీన, ఆధునిక సాహిత్యాల అధ్యయన పరిజ్ఞానం ఉంది. సాహిత్య విమర్శకులకు ఒక ప్రాపంచిక దృక్పథం, ఒక నిబద్ధత, ఒక తాత్విక నేపథ్యం ఉండటం ఎంత అవసరమో విమర్శిని ద్వారా రుజువు చేశారు. విశ్వనాథ, కొ.కు, శ్రీశ్రీ, వల్లంపాటి వలె కొలకలూరి ఒక వైపు సృజనాత్మక రచనలు చేస్తూ మరో వైపు సాహిత్య విమర్శను సుసంపన్నం చేశారు. ఆయన సవ్యసాచి.
పేజీలు : 312