30వ బొమ్మ చెప్పిన కథ

విక్రమార్కుడి రాజ్యంలో ఒక అడవిలో పందులు వచ్చి పక్కగ్రామాల్లో ఉన్న పైరును పాడుచేసి అల్లకల్లోలం చేస్తూ ఉండేవి. ఏమీ చేయలేక కొందరు గ్రామస్థులు వెళ్ళి విక్రమార్కునికి విన్నవించుకున్నారు.

విక్రమార్కుడు వారికి అభయం ఇచ్చి ఆ పంటపొలాల వద్దకు వచ్చి పంటను పాడు చేస్తున్న ఒక పందిపై బాణం ప్రయోగించాడు. అది భయపడి పరుగుతీస్తూ ఉంటే ఒక గురం మీద దానిని అనుసరించాడు విక్రమార్కుడు.

అది ఒక పెద్ద కొండ గుహ వద్దకు వెళ్ళి దానిలో దూరింది. విక్రమార్కుడు గుర్రం దిగి గుహలోకి వెళ్ళాడు. కొంతదూరం నడిచిన తరువాత అతడికి అద్భుతమైన వెలుగు కనిపించింది.

ఇంకా కొంత దూరం నడవగా అక్కడ ఒక అద్భుతమైన భవనము కనిపించింది. దానిలో ఉన్న ఒక గదిలో అనేక దివ్యాభరణాలు ధరించిన ఒక రాక్షసుడిని చాలా మంది సేవిస్తూ కనిపించారు.

ఇది రాక్షసనివాసమా అనుకుంటూ  అతని వద్దకు వెళ్ళగా అతను లేచి నమస్కరించి కూర్చోబెట్టి ''మహారాజా! నేను బలిచక్రవర్తి ఆధీనంలో ఉండేవారిలో ఒకడిని. పనిలేనప్పుడు వేడుకగా నేను ఇక్కడ ఉంటాను. మేము మాట్లాడుకునేటప్పుడు నీ శక్తి సామర్థ్యాల ప్రస్తావన వచ్చింది. అందుకని నిన్ను చూడాలనిపించి వరాహం ద్వారా నిన్ను ఇక్కడకు రప్పించాను. అతను నిజంగా పంది కాదు. నన్ను క్షమించు. నీ దర్శన భాగ్యం నాకు లభించింది'' అని అతనిని పాతాళలోకంలోని బలిచక్రవర్తి వద్దకు తీసుకుని వెళ్ళాడు.

బలిచక్రవర్తి విక్రమార్కుడికి ఎంతో మర్యాద చేసి అతనికి అమృతకలశము ఇచ్చి దానిని ఎలా ఉపయోగించాలో తెలిపాడు. ఇంకా కొన్ని నాగరత్నాలను కూడా ఇచ్చాడు.

గుహవెలుపలికి సాదరంగా వీడ్కోలు పలికాడు. గుర్రాన్ని అధిరోహించిన విక్రమార్కుడు తన పరివారాన్ని కలుసుకుని నగరానికి బయలుదేరాడు.

వచ్చేదారిలో ఒక చెట్టుకింద కుష్టువ్యాధితో ఒక బ్రాహ్మణుడు బాధపడుతూ ఉంటే అతనికి తన చేతిలో అమృత కలశము ఇచ్చి ''దీన్ని వల్ల నీకు నయమౌతుంది'' అన్నాడు.

అలాగే పంది వల్ల నష్టపోయిన పంటలు గలవాళ్ళకి కూడా అమృత కలశాలు ఇచ్చాడు.

భోజరాజా! అలాంటి విక్రమార్కుడి పీఠానికి నీవు తగినవాడివేనా?'' అని అడిగింది ప్రతిమ భోజరాజు వెనుకకు వెళ్ళిపోయాడు.

పేజీలు :308

Write a review

Note: HTML is not translated!
Bad           Good