తుంబా, శ్రీహరికోట, అహ్మదాబాద్‌ మేనేజ్‌మెంటు సంస్థ, డిజైన్‌ సంస్థ - టెర్ల్స్‌, పి.ఆర్‌.ఎల్‌., ఎన్‌.ఐ.టి. అన్నీ ఆయన ప్రాణం పోసినవే.

మన అంతరిక్ష పరిశోధననీ, కమ్యూనికేషన్‌ ఉపగ్రహయాన సాంకేతికతనీ మన అణుసామర్థ్యాన్నీ అగ్ర రాజ్యాలు గౌరవించేలా తీర్చిదిద్దారు.

రాజారామన్న, అయ్యంగారు, యు.ఆర్‌.రావు, అబ్దుల్‌ కలాం - ఇలా ఎందరో ఆయన ప్రభావానికి లోనయినారు. అంతర్జాతీయ శాస్త్రవేత్తలకు ఆప్తుడు. నెహ్రూ, శాస్త్రి, ఇందిరాగాంధీలకు ఆలోచనా బంధువు.

సి.వి.రామన్‌ సలహాలతో పెరిగి వారసుడై అణుశక్తిని శాంతి ప్రయోజనాలకు ఉపయోగించాలనే ఆదర్శానికి సారథిగా సారాభాయి మన దేశానికి చేసిన సేవలు అద్వితీయం.

చంద్రుడిలో సీ ఆఫ్‌ సెరినిటీలోని లోయను సారాభాయి క్రీటర్‌గా పిలిచేలా ఆచంద్రతారార్కంగా పేరొందిన, సారాభాయి శాస్త్ర దృష్టి, దూరదృష్టి, ఉత్సాహం, సంపన్న వ్యక్తిత్వం ఈనాటి యువకులకు దారి చూపుతాయి. వారు సాధించగల ఎన్నో లక్ష్యాలను ఏర్పరుస్తాయి.

పేజీలు : 207

Write a review

Note: HTML is not translated!
Bad           Good