పరిస్థితులు ఎలాంటివైనా సరే, పారిపోయేవారు గెలవలేరు, గెలవాలనుకునేవారు ఓడిపోరు. జపనీస్ సమురాయ్లా ఎప్పుడూ జాగరూకతతో, ఏకాగ్రతతో, ప్రశాంతచిత్తంతో ఉండాలి. నీ ఆత్మ, హృదయం ప్రతీ క్షణం మమేకమైపోవాలి. మన ఆలోచనలను బట్టి మనకు ఎదురయ్యే పరిస్థితులు కూడా ఆధారపడివుంటాయి. విజేతల పంథాను ఎంచుకుంటారా, లేక ఓటమి పాలయ్యే వారి పంథాను ఎంచుకుంటారా, లేక కలలు కంటూ ఊహలలో విహరించేవారి పంథాను ఎంచుకుంటారా అనేది అంతా ఇక మీ చేతులలోనే ఉంది. |