మాధవ్ దేశం కోసం జైలుకి వెడతాడు. 1947 లో స్వాతంత్ర్యం వచ్చాక అతడూ విడుదల అవుతాడు. తన కోసం ఎన్ని యుగాలైనా సరే ఎదురు చూస్తానని బాన చేసిన మరదలు సుధా మరొకరి సొంతమై పోతుంది. ఆ తర్వాత విచిత్రమైన పరిస్థితుల్లో పరిచయమవుతుంది. సంధ్య . అయితే అనుకోకుండా రైలు లో సంధ్యని బలత్కరిస్తాడు మాధవ్ అక్కడి నుంచి కదా ఎన్నో మలుపులతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. యద్దనపూడి సులోచనారాణి శైలిని గురించి ప్రత్యకంగా చెప్పుకోనక్కరలేదు . ఆమె నవల మొదలు పెడితే సినిమా చూసినట్టే ఉంటుంది.
ఆమె సన్నివేశా కల్పనాచాతుర్యం అది. ఒకానొక బలహీన క్షణంలో తప్పు చేసినా, మంచితనమూ మానవత్వమూ ఉన్న వ్యక్తీ మాధవ్. స్వభిమానమూ పట్టుదల కలిగిన యువతి సంధ్య. వీరిద్దరినడుమ ఏర్పడిన అగాధం తోలగిందా ?  వారిద్దరూ ఒక్కటయ్యారా ? తెలుసుకోవాలంటే విజేత చదవాల్సిందే .

Write a review

Note: HTML is not translated!
Bad           Good