విజయవాడ చరిత్రను సుసంపన్నం చేసింది. రాజ్యాధికార కాంక్షతో రక్తపాతం సృస్టించిన రాచరిక వ్యవస్థ కాదు, తాము సంపాదించుకొన్నది తమ జీవితంలోనే సత్కర్యాలను వినియోగించిన యశఃకాయులైన వారి పేర్లు నేటికీ శిలాశాసనాల రూపంలో కనిపిస్తున్నాయి. ఆ మహనీయుల శ్రేణిలో చేర్చ తగిన వదాన్యులే ఇప్పుడు తమకు వ్యాపారరీత్యా లాభం లేకపోయినప్పటికీ అభిమానంతో సప్తసంతానాలలో ఒక బిడ్డకు తండ్రి అయ్యారు. సాధ్యమైనంత వరకు నగర చారిత్రిక స్వరూపం చిత్రీకరించాలని ప్రయత్నించాను.ఇది కొండలు చేతిలో పట్టుకోవటం లాంటి పని. వీధులకు పరిమితమై, ఆ విధికి సంబంధించిన ఆసక్తి కరమైన చారిత్రిక విశేషాలు ఉటంకించాను. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good