మిమ్మల్ని మీరు ఉన్నతులుగా తీర్చిదిద్దుకోవటం కోసం, మీ మానసిక బలహీనతల్నీ, సమస్యల్నీ అధిగమించడం కోసం, మీ అంతర్గత శక్తులను పఠిష్టం చేసుకోవడం కోసం, మానవ సంబంధాలు మెరుగు పర్చుకోవడం కోసం టెన్షన్‌, బోర్‌, నిరాసక్తత పారద్రోలటం కోసం, ఆర్ధికంగా నిలదొక్కుకోవటం కోసం, అంతిమ విజయం సాధించటం కోసం, అందరికీ అర్ధమయ్యే రీతిలో రూపొందించబడిన వ్యక్తిత్వ వికాస పుస్తకం - యండమూరి వీరేంద్రనాథ్‌ రాసిన 'విజయానికి అయిదు మెట్లు'.

ఏదైనా సమస్య మనతోపాటే ఉంటుంది. అది మన హృదయపు గదిలోనే ఉంటుంది. ఆ గదికి తాళం వేసుంటుంది. దాన్ని పారద్రోలటానికి తాళం చెవి మాత్రం దొరకదు. అలాంటి తాళం చెవి ఎలా సంపాదించాలన్నదే ఈ పుస్తకం ముఖ్యోద్దేశం. మనసుగదిలోంచి సమస్యను పారదోలటమే ఈ పుస్తకపు ఆశయం.

మనోవిజ్ఞానానికి సంబంధించిన రచనలు తెలుగులో చాలా తక్కువగా ఉన్నాయి. ఆలోటును తీరుస్తూ, చక్కగా అందరికీ అర్ధమయ్యే భాషలోనే కాక ఒకసారి చదవడం ప్రారంభిస్తే మరి వదలకుండా పాఠకునిచేత చివరంటా చదివించే ఆకర్షణీయమైన శైలిలో, విషయం వివరించిన తీరు బాగుంది.

ప్రపంచం అంతా నిన్ను వదిలిపెట్టినప్పుడు నీతో వుండేవాడే మంచి స్నేహితుడు. పుస్తకం మంచి స్నేహితుడు. అది చెప్పేది వినగల్గితే ఆ స్నేహితుడి కన్నా గొప్ప తెలివైన వాడు ఇంకెవరూ వుండరు. ఎంతో మంది రచయితలు తమ జీవితపుటనుభవాల్నీ, విజ్ఞానాన్నీ కలబోసి అవతలివాళ్ళకు చెప్పటం కోసం అహోరాత్రులూ శ్రమించిన తపనా రూపమే పుస్తకమంటే. అదిగో అలాంటి మంచి స్నేహితుడిని మీకు పరిచయం చేస్తున్నందుకు ఆనందిస్తున్నాం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good