భార్యా భర్తలు అన్యోన్యంగా వుంటూ పొరపొచ్చాలు లేకుండా కాపురం చేయాలంటే, దాంపత్య విజయంలో సమాన భాగస్వామ్యం పొందాలంటే ఎలా ప్రవర్తించాలో, పరస్పరం ఎలా సహకరించుకోవాలో ఆ విషయాలన్నింటినీ వివరంగా చర్చించారు రచయిత.

దాంపత్యాన్ని ఒక అందమైన కలగా మలచుకోవటానికి, సంసార సహజీవనం సజావుగా సాగటానికి వ్యక్తులు ముందుగా తమను తాము అర్థం చేసుకుని, ఒక అంచనా వేసుకుని పరస్పర సహకారంతో ముందుకు సాగాలంటే ఏం చేయాలో, ఎలా ప్రవర్తించాలో, శాస్త్రీయ దృక్పథంతో చక్కగా వివరించారు రచయిత.

పూర్వపు సమాజానికి ప్రస్తుత సమాజానికి చాలా తేడా ఉంది. వ్యక్తుల అభిప్రాయాలలో ఆలోచనలలో ఎన్నో మార్పులొచ్చాయి. ఆధునిక యోచనల ప్రభావం వల్ల మనుషులలో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఆ సందేహాలను నివృత్తి చేసుకుని ముందుకు సాగిపోవటానికి ఉపయుక్తమైన సమాచారం యీ పుస్తకంలో వుంది. భార్యా భర్తలు ఒకరి ఆలోచనా విధానాన్ని మరొకరు గౌరవిస్తూ, ఇద్దరికీ నష్టం కలగనంతవరకు ఒకరినొకరు అభిమానిస్తూ, గౌరవించుకుంటూ ప్రేమ ద్వారా ఒకరి ఆలోచనను మరొకరి వైపు తిప్పుకుంటూ దాంపత్యాన్ని కొనసాగించినప్పుడే ఆ సంసారం విజయవంతమవుతుంది అంటారు రచయిత. ''ప్రేమంటే రెండు గుండెలు ఒకే ట్యూన్‌లో శబ్దించటం కాదు. రెండు ఆలోచనలు భిన్నంగా శబ్దించి ఒకే ఆలోచనగా రూపుదిద్దుకోవడం, వంటి ఎక్స్‌ప్రెషన్స్‌ బాగున్నాయి.

రచయిత తన విశిష్ట వచనశైలిలో జీవితంలో మానవ సంబంధాల ప్రాముఖ్యతను బాగా వివరించారు. ప్రేమ తత్వానికి, ప్రేమైక జీవన సౌందర్య నిర్వచనానికి, అవినాభావ సంబంధ అనుబంధ బాంధవ్యాల విశ్లేషణకి, అనితర సాధ్యమైన భాష్యాన్ని చెప్పిన విలువైన పుస్తకం ''విజయంలో భాగస్వామ్యం'.

Write a review

Note: HTML is not translated!
Bad           Good