అప్పుడుగాని ఇప్పుడుగాని జన జీవనం వ్యక్తి, సమాజం, దైవం అనే మూడు చక్రాలమీద నడుస్తుంటుంది. దేశ కాలాల్ని బట్టి ఒక్కొక్క సమయంలో ఒక్కొదానికి ప్రాముఖ్యత లభిస్తుంది. అభ్యుదయవాదులంటే దైవాన్ని నమ్మని వారనే ఒక అపోహ జనంలో ఉన్నది. అభ్యుదయ భావాలకు, మత విశ్వాసాలకు, దైవభక్తికి విరోధమని నాకనిపించదు. గురజాడ, కందుకూరి నుండి ఉన్నవ లక్ష్మీనారాయణగారి దాకా ఎందరో సంస్కర్తలు దైవభక్తిలేనివారు కారు. సమాజాభ్యుదయం కోరిని ఈ కవి ఆ మార్గంలోనే 'భక్తి భక్తుడు', యోగీ, బోధ, నతి మొదలైన శీర్షికలలో ఆధ్యాత్మిక కవిత్వం వ్రాశారు. - పింగలి వేంకట కృష్ణారావు |