పుస్తక పఠనం అనే చక్కని అలవాటు మీ జీవితంలో భాగమై మీరు ఆశించిన ఫలితాలు సాధిస్తూ, అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను. అందుకు ఈ 'విజ్ఞుల మాటలు - విజయానికి బాటలు' చక్కగా ఉపయోగపడుతుంది.

    ఈ అతి ముఖ్యమైన పుస్తకంలో వివిధ రంగాలకు చెందిన వంద మంది ప్రముఖులు చెప్పిన వెయ్యి సూక్తులు ప్రచురించబడినవి.

    ఆఫీసుబాయ్‌ నుంచి అసిస్టెంట్‌ మేనేజర్‌గా ఎదగడానికి ప్రతిరోజూ నాకెన్నో పుస్తకాలు స్ఫూర్తి నిచ్చాయి. ఎందరో మహాత్ముల జీవితానుభవంతో చెప్పిన చిరు వాక్యాలు ఉపనిషత్తుల సారంగా గ్రహించగలిగాను. ఆ జీవన వేదాల స్ఫూర్తితో ... పడిన ప్రతీసారీ నిలదొక్కుకోగలిగాను.

    అదిగో... అలాంటి హితోక్తులు...''విజ్ఞుల మాటలు - విజయానికి బాటలు'' పేరుతో సంకలనం చేసి మీ ముందుకు తెస్తున్నాను. - రచయిత కందుకూరి రాము

Write a review

Note: HTML is not translated!
Bad           Good