తెలుగులో తెలుగు భాషా సమితి అనేక విజ్ఞాన సర్వస్వ సంపుటాలను వెలువరించింది. అయితే అవి సాధారణ పాఠకులకు ముఖ్యంగా విద్యార్ధులకు అందుబాటులో లేవు. అంతటి ఉద్గ్రంథాలను చదివి అర్ధం చేసుకొనే సామర్ధ్యాలు, తీరిక నేటి విద్యార్ధులకు లేవు.
విద్యార్ధులకు ముఖ్యంగా ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్ధులకు అందుబాటులో ఉండే విధంగా 'విజ్ఞాన సర్వస్వం (సాధారణ విషయ పరిజ్ఞానం)' అనే ఈ పుస్తకం రచించటం జరిగింది.
ఈ పుస్తకంలో విజ్ఞాన శాస్త్రం (Sciece)గణితశాస్త్రం (Mathematics), ఖగోళశాస్త్రం (Astronomy), భూగోళశాస్త్రం (Geography), రాజనీతిశాస్త్రం (Political Science), అర్ధశాస్త్రం (Economics), తత్త్వశాస్త్రం (Philosophy), చరిత్ర - సంస్కృతి (History and Culture), అనే విభాగాలున్నాయి. ప్రతి విభాగంలోనూ ఆ విభాగానికి సంబందించిన వివిధ విషయాలు అకారాది క్రమంలో ఇవ్వబడినవి. ఈ పధ్ధతి వల్ల ఒక విషయానికి (Subject) సంబంధించిన అంశాలన్నీ ఒకే చోట ఉండి విద్యార్ధులకు సౌకర్యంగా ఉంటుందని ఆశించడం జరిగింది.
నిజానికి విజ్ఞాన సర్వస్వం అంటే అన్ని విషయాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఉండాలి. కాని విజ్ఞానం అపారం. అపారమైన విజ్ఞానాన్ని ఈ చిన్న పుస్తకంలో సమగ్రంగా చేర్చవలసిన అంశాలను చేర్చటం జరిగింది.--- పి.వి.కె. ప్రసాదరావు

Write a review

Note: HTML is not translated!
Bad           Good