మనిషి ఎంతోదూరం నడిచి వచ్చాడు. వెనక్కి చూసుకుంటే కొన్ని వేల వేల సంవత్సరాల నుండి అతడు నడిచొచ్చిన బాల కనిపిస్తోంది. అసిపోయాడా? లేదు - అతనిలో ఇంకా ఎంతో దూరం పోగలిగినంద శక్తి ఉంది. నడుస్తూనే ఉన్నాడు. విచిత్రమేమిటంటే - ఎక్కడైనా ఓ క్షణం ఆగి ఆలోచిస్తే అక్కడే అతనికి ఒక కూడలి కనిపిస్తోంది. ఆ కూడలిలో నాలుగు రోడ్లు కాదు - నలభై రోడ్లు కాదు - నాలుగ వందల నలభైకాదు... ఇంకా ఇంకా ఎక్కువే రోడ్లు కనిపిస్తున్నాయి.

జీవశాస్త్రం, రసాయనిక శాస్త్రం, భౌతికశాస్త్రం, సంఖ్యాశాస్త్రం, సాహిత్యం, కళలు, సంగీతం, వ్యాపారం, ఎగుమతులు, ఆర్థికం, సామాజికం, సాంకేతికం, ఎలక్ట్రానిక్స్‌, వైద్యం, ఆరోగ్యం, పత్రికలు, ప్రచురణ, పర్యావరణం, విమానం, రాకెట్‌, బాంబు, న్యూక్లియర్‌ వెపన్స్‌, పెస్టిసైడ్స్‌, రుణాలు, సాయం, వ్యవసాయం, మెరైన్‌, సబ్‌మెరైన్‌, ... అసలు ఎన్నని? ఎన్ని రోడ్లని? ఎన్ని శాఖలని? ఎన్ని విభాగాలని? మనిషి మేధస్సులో రకరకాల విజ్ఞానం, వింత వింత పరిజ్ఞాన. ఏదారివైపు చూస్తే దాని వివరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చుట్టూ కలియజూస్తే అన్ని శాఖలు, అన్ని రోడ్లు ఒకే పరిధిలో కలిసిపోయి ఒక పెద్ద వృత్తంగా తయారవుతున్నాయి......

Pages : 112

Write a review

Note: HTML is not translated!
Bad           Good