ఈ పుస్తకం విశేష ప్రజానీకానికి విశేష ఆకర్షణ. ఈ విజ్ఞాన కాలక్షేపంలో గౌతమ బుద్ధుని ప్రబోధలు, విజ్ఞానదీపికలు, ఉద్ధారములు, లోకం పోకడ/రీతి, నెరవాది నిర్వచనాలు లాంటి అంశములు క్రోడీకరింపబడినవి.
తెలుగు, ఇంగ్లీషు - ఈ రెండు భాషలకు వెలుగు చూపిస్తుంది ఈ పుస్తకం. మాతృభాష అనగా 'అమ్మభాష', ఉగ్గుపాలతో మొదలిడిన సంస్కారం. ఇంగ్లీషును మనం మనలో జీర్ణింపచేసుకున్నాం. ఈ పుస్తకంలో ఈ రెండు భాషల ఔన్నత్యం చవిచూడవచ్చు చదువరులు.
తెలుగును 'ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌' అని మెచ్చుకున్నారు. మన భారతదేశంలో మొట్టమొదటి/తొలి భాషాప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశమే.
అన్ని భాషలయందు తెనుగు మిన్న. విజ్ఞాన కాలక్షేపం (వైస్‌ టైమ్‌-పాస్‌)  మీ హృదయాలకు హత్తుకునేటట్లు విద్యార్ధులకు, టీచర్లకు, పత్రికా సంభౄషణాచతురులకు విజ్ఞాన కాలక్షేపం తీర్చిదిద్దబడింది. రచయితలకు, చేదోడువాదోడుగా ఉంటుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good