Rs.200.00
In Stock
-
+
ఈ వ్యాసాల్లో అయిదారు అంశాలు గత కాలానికి సంబంధించి నావే అయినా వాటికి కూడా కాల దోషం లేదు. యందు వలనంటే - 1999 లో మూడో ప్రపంచ యుద్ధం ఖాయం - వ్యాసం ద్వారా జ్యోస్యంలో నిజా నిజాలు తెలుస్కోవచ్చు. మాజీ సంస్థానాధీశుల హక్కులు - వ్యాసం ద్వారా ఆనాడు వారికి కొద్ది వేలు, లక్షలు భారణాలు గా చేల్లించడానికి కి భారంగా భావించిన మన పాలకులు నేడు లక్షలు, కోట్లు ఫించన్లుగా , రాయితీలుగా పొందటం ఎలాంటి న్యాయమో పాఠకులు గమనించ వచ్చు. అలాగే గిట్టుబాటుగాని వ్యవసాయం వ్యాసాలు 40 సంవత్సరాల క్రిందటివి అయినా ధరల లో మార్పు తప్ప, ఈ నాటికీ రైతుల దుస్థితి లోగడలాగానే వుండటం గమనించవచ్చు.వివిధ పత్రికలలో వచ్చిన ఈ వ్యాసాలను పుస్తకంలో ప్రచురించ టానికి అనుమతించిన ఆయా పత్రికాధిపతులకు కృతజ్ఞతలు.