జీవితంలో బాగా అభివృద్ధి చెందాలి...
అనేక గొప్ప విజయాలను సాధించాలనుకునే...
ప్రతి విద్యార్థి తప్పనిసరిగా చదవవలసిన వ్యక్తిత్వ వికాస పుస్తకం 'విద్యార్థి తెలుసుకో'.
విద్యార్థి దశలోనే ప్రతి విద్యార్థి ఉన్నత వ్యక్తిత్వాన్ని అలవరుచుకోవాలి. ముఖ్యంగా 13 నుండి 23 సంవత్సరాలలోపు ప్రతి విద్యార్థి తమ ఉజ్వల భవిష్యత్ కోసం ఉన్నత వ్యక్తిత్వాన్ని, ఉన్నత విద్యను, క్రమశిక్షణను, ఆలోచనలో పరిణతను, ప్రత్యేక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. ప్రతి విద్యార్థి వారిని వారే ఉన్నతులుగా తీర్చిదిద్దుకోవటం కోసం... వారి అంతర్గత శక్తి సామర్థ్యాలను మరింత అభివృద్ధి చేసుకోవటం కోసం... ఈ పుస్తకం తప్పక ఉపయోగపడుతుంది.
ప్రతి తల్లిదండ్రులు... తమ పిల్లల వ్యక్తిత్వ వికాసం కోసం... అలాగే ప్రతి ఉపాధ్యాయుడు / లెక్చరర్ / ప్రిన్సిపాల్ తమ విద్యార్ధుల అభ్యున్నతికోసం ఈ పుస్తకాన్ని బహుమతిగా అందించి ప్రోత్సహించాలి.
''విద్యార్థి తెలుసుకో!'' విద్యార్థులకు మార్గదర్శి. చైతన్య కరదీపిక. ప్రతి ఒక్కరిని ఆలోచింప చేస్తుంది. ఎంతో విలువైన...సలహాలను, సూచనలను ప్రోత్సాహాన్ని అందిస్తుంది. చదవండి - ఆచరించండి - అభివృద్ధిలోకి రండి. మీ స్నేహితులతో చదివించండి.