దేశాన్నైనా చూడూ...కోశాన్నైనా చూడు' అని లోకోక్తి. నిఘంటువుల్నిగనుక రోజుకి ఒక్కసారన్నా చదివితే విద్యార్ధులకి ఎంతో విజ్ఞానం లభిస్తుంది. ఒక పదానికి వివిధ రకాల అర్ధాల్ని వాటి విశేషాలతో సహా తెలియజేసే శబ్దరత్నాకరం, శబ్దార్థచంద్రిక వంటి పెద్ద నిఘంటువులు ప్రస్తుతం మనకి విరివిగా లభిస్తున్నాయి. అయితే పాఠశాల, కళాశాల (డిగ్రీ స్ధాయి) విద్యార్ధులకు అనుగుణంగా సులభశైలిలో వుంటే నిఘంటువులు తక్కువగా ఉన్నాయి. అందుకే నవరత్న బుక్‌ హౌస్‌ ద్వారా ఈ విద్యార్ధి నిఘంటువుని వ్యవహార భాషలో సరళంగా కేవలం పదం, దానికి సంబంధించిన ముఖ్యమైన అర్థాలతో రూపొందించారు సంపాదకులు జయంతి చక్రవర్తి గారు. పద సంపద పెంపొందించుకోవాలనుకునే విద్యార్ధులకు ఈ నిఘంటువు కరదీపికలా ఉపయోగపడుతుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good