లునచార్‌స్కీని విద్యాశాఖ ప్రజా కమిస్సారుగా (మంత్రిగా) లెనిన్‌ నియమించాడు. విద్యారంగంలోని ఇతర ప్రముఖులతో కలిసి లునచార్‌స్కీ సోవియట్‌ ప్రభుత్వం తొలి రోజుల్లో ఎదుర్కోవలసివచ్చిన క్లిష్ట పరిస్థితుల్లో ఒక నూతన విద్యా వ్యవస్థకి పునాది వెయ్యడంలోనూ, సోవియట్‌ పాఠశాలను సంస్కరించేందుకు అవసరమైన సైద్థాంతిక, ఆచరణాత్మక మౌలిక సూత్రాలను రూపొందించడంలోనూ సఫలుడయ్యాడు. లునచార్‌స్కీ ఆనాడు చెప్పిన మాటల్లోని దూరదృష్టి మూలంగా వాటికి సమకాలికత సమకూరింది. పాఠశాలకీ - జీవితానికీ మధ్య సంబంధాలపైనా, పాఠశాల పోలీటెక్నికల్‌ స్వభావం పైనా, సాంస్కృతిక రంగంలో నిర్మాణాత్మక కృషి, ఆర్థిక - రాజకీయ సమస్యలకు వున్న ప్రత్యక్ష సంగతత్వం పైనా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకించి ఈనాటికీ మరింతగా తగివున్నాయి.

పేజీలు : 344

Write a review

Note: HTML is not translated!
Bad           Good