ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తూ సామజిక జీవనానికి సంపదను సృష్టిస్తూ భారత సమాజ పురోగమనానికి పునాదిగా వున్న భిన్న సామజిక పీడిత ప్రజారాశుల విద్యాభివృద్ధికీ, వారి సంక్షేమానికి ఉద్దేశించి కాకుండా కేవలం ధనికులకు, ఉన్నత సామజిక వర్గాలకు నిర్దేశించినదిగా విద్యావిధానం రూపొందించడం జరిగింది. సమాజహితాన్ని దృష్టిలో పెట్టుకొని నిజమైన ప్రజాస్వామిక, లౌకిక ప్రజాతంత్ర విద్యా విధానాన్ని రూపొందించి ఆ విద్యావ్యవస్థ నిర్వహణలో సంబంధిత వర్గాల విద్యా వేత్తలు, విద్యార్ధి ప్రతినిధులు, విద్యాభిలాషులకు చెందిన వారిని మినహాయించడం జరిగింది. ఈ పరిస్థితుల నేపధ్యం నుంచే పాఠశాలకు - సమాజానికి, ఉత్పత్తికి - సిలబస్ రూపకల్పనకు మధ్యగల గతితార్కిక భౌతికవాద సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యావిధానాన్ని రూపొందించాలి, అన్ని సామజిక వర్గాలకు విద్యను అందుబాటులోకీ తేవాలంటే అన్ని స్థాయిల్లో అవసరమైన విద్యాసంస్థలను ఏర్పరిచి తగినన్ని నిధులను సమకూర్చాలి. భారతసమాజ ప్రత్యేకతలను పరిగణలోకి తీసుకొని అన్ని సామజిక వర్గాల మధ్య సమానత, సామరస్యత, సౌభ్రాతృత్వం పెంపొందించే లౌకిక ప్రజాతంత్ర విద్యావిధానం ఉండాలన్న జాతీయోద్యమ ఆశల, ఆకాంక్షల సాకారానికి వలస పాలకులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఈ విషయంలో సృష్టమైన దృక్పధంతో వలస పాలకులు ఉన్నందునే తమ ప్రయోజనాలకనుగుణంగా చివరి వరకు వ్యవహరించారు. వలస పాలకులు భారతదేశంలో విద్యావిధానం అమలుకు పూనుకున్న తొలిదశలోనే విద్యావిధానం రూపకల్పన స్వభావం, దృక్పధం, దాని పరిమితులు, పరిధి తదితర అంశాలను చాలా స్పష్టంగా ప్రకటితమయ్యాయి. ఈ విషయంలో మెకాలే బ్రిటిష్ పార్లమెంట్ కు నివేదించిన నివేదికయే సజీవ సాక్ష్యంగా ఉంది. భారత దళారీ పాలకులు కూడా స్వాభావ రీత్యా అదే విద్యా విధానాన్ని కొనసాగిస్తున్నారు. --- ఎం. శ్రీనివాస్
ఈ పుస్తకాన్ని విద్యార్ధి ఉద్యమంలో పనిచేసిన విద్యార్ధి నాయకుని ఆలోచనలకు దర్పణంగా చూడవచ్చును. విద్యార్ధి నాయకుల ఆలోచనల్లో వేయి పూలు వికసిస్తాయని, వందల ఆలోచనలు సంఘర్షిస్తాయనటానికి శ్రీనివాస్ రచనలు నిదర్శనం, అధ్యయనంతో ఎదిగిన పోరాటమే విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తుంది. ఆ దిశగా ఆలోచనల పిడికిలి బిగించిన శ్రీనివాస్ అభినందిస్తున్నాము. --- చుక్కా రామయ్య (ప్రముఖ విద్యావేత్త - శాసనమండలి మాజీ సభ్యులు)

Write a review

Note: HTML is not translated!
Bad           Good