నిర్మాణ్‌ ఒక స్వచ్ఛంద సంస్థ. భారతదేశ పున: నిర్మాణమే ధ్యేయంగా 2005లో బిట్స్‌ పిలాని విద్యార్థులచే స్థాపించడం జరిగింది. గ్రామీణ విద్యార్థినీ, విద్యార్థులకు వృత్తిపరంగా, విద్యాపరంగా ఉండే అవకాశాలు, వివిధ రకాల సలహాలు, సూచనలు తెలియజేయడానికి 2010 లో దేశంలోనే ప్రప్రథమంగా నిర్మాణ్‌ సంస్థ ''విద్యా హెల్ప్‌లైన్‌'' పేరుతో వినూత్నంగా ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా పలు రాష్ట్రాలలోని విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారు.

ఇందులో భాగంగా మీరు చదువులోను మరియు మీ జీవితంలోను విజేతలుగా నిలవడానికి ఈ క్రింది విషయాలు పాటించాలి.

1. మొదటగా మీకు నచ్చిన రంగాన్ని /చదువును/వృత్తిని ఎంచుకోవాలి. ప్రపంచంలో ఒక మంచి మార్పు తెచ్చినవాళ్ళందరు వారికి నచ్చిన రంగాన్ని ఎంచుకుని దానినే వారి ధ్యేయంగా మార్చుకున్నవాళ్ళే అని మీరు గమనించాలి.

2. రెండవది మీకు నచ్చిన రంగంలోని ప్రముఖులలో ఒకరిని లేదా కొందరిని స్ఫూర్తి (రోల్‌ మోడల్‌)గా ఎంచుకోవాలి. వాళ్ళ జీవిత ప్రయాణం, అనుభవాలు మరియు ఆలోచనలను తెలుసుకోవాలి.

3. మూడవది మీరు ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగేలా మీరు నిరంతరం కలలు కనాలి. ఆ కలలను సాకారం చేసుకునే దిశగా ప్రయత్నించాలి.

4. చివరిగా మీ లక్ష్యం కోసం కఠోర శ్రమ, కష్టపడేతత్వంతో నిత్యం ముందుకు సాగాలి. విజయానికి ఇంతకన్నా మంచి ప్రత్యామ్నాయం లేదు.

ఈ కరదీపికలో వివిధ విద్యారంగాలకు, వృత్తులకు సంబంధించిన వివరాలను విస్తృతంగా వివరించడం జరిగింది. వ్యవసాయ, వైద్య, ఆర్థిక, ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, ష్యాషన్‌ టెక్నాలజీ, ప్రభుత్వ ఉద్యోగాలు, విదేశీ విద్యకు సంబంధించిన వివరాలు మరియు ఇతర కోర్సులకు సంబంధించిన సమాచారం తెలుపబడింది. వాటితోపాటు స్కాలర్‌షిప్స్‌ వివరాలు మరియు ప్రభుత్వ వసతి గృహాలకు సంబంధించిన వివరాలు ఇవ్వబడినవి. ఇంకా పదవినోదాలు కూడా జత చేయబడినవి. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా సరళమైన భాషలో వ్రాయబడినది.

పేజీలు : 77

Write a review

Note: HTML is not translated!
Bad           Good