నేటి బాలలే రేపటి పౌరులు. మంచి పౌరులుగా ఎదగాలంటే వారికి బాల్యం నుంచి మంచి విద్యను అందించాలి. విద్యతో పాటు ఎదగడానికి అవసరమైన వాతావరణాన్ని కల్పించాలి. వృత్తిపరంగా, విద్యాపరంగా ఉండే అవకాశాలను పాఠశాల దశలోనే విద్యార్థులు అర్థం చేసుకోగలిగితే అది వారికి ఎంతో ఉపయోగకరం. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థిని, విద్యార్థులకు పదవ తరగతి తరువాత ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించడం ఎంతో అవసరం.

గ్రామీణ ప్రాంతాలలో విద్యను అభ్యసించిన నాకు మంచి అవకాశాలు తెలుసుకోవడంలో ఉన్న అంతరాలు, సమాచార లోపం మరియు ఇతరత్ర సమస్యలను గురించి తెలుసుకోవడం జరిగింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సరియైన సమాచారం లేకపోవడం వలన వారికి కేరీర్‌ గురించిన అవగాహన లేకపోవడం జరుగుతుంది. దీనికోసం మా నిర్మాణ్‌ విద్యా హెల్ప్‌లైన్‌ 'సమాచార దీపిక' మరియు 'కేరీర్‌ గైడెన్స్‌' కార్యక్రమం రూపొందించడం జరిగింది.

విద్యార్థులకు భవిష్యత్తుని తీర్చిదిద్దడంలో కెరీర్‌ గైడెన్స్‌ ముఖ్యపాత్ర పోషిస్తుంది. విద్యార్థులకు వారి వ్యక్తిగత అభిరుచి మరియు శక్తిసామర్థ్యాల ఆధారంగా వారికి లక్ష్యాన్ని నిర్దేసిస్తూ, ఆ లక్ష్యానికి తగిన అవకాశాలను ఎంచుకొని ఎలా విజయం సాధించాలో తెలియపరచడానికి కెరీర్‌ గైడెన్స్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

సమాచార దీపిక వివిధ రకాల కోర్సుల గురించి మరియు వాటి ద్వారా వచ్చే ఉపాధి అవకాశాలను గురించిన వివరాలను అందిస్తుంది. అంతేగాక వివిధ ప్రవేశ పరీక్షలు, స్కాలర్‌షిప్స్‌ మరియు హాస్టల్‌ సదుపాయాలు వాటి వివరాలు ఇందులో పొందుపరచబడినవి. విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి సరైన మార్గం ''కెరీర్‌ పాత్‌'' చూపిస్తుంది.

పేజీలు :75

Write a review

Note: HTML is not translated!
Bad           Good