జయం, పరంజ్యోతి తర్వాత మల్లాది వెంకట కృష్ణమూర్తి కలం నించి వచ్చిన మూడవ ఆధ్యాత్మిక నవల ఇది.  సమస్యల్లో చిక్కుకున్నవారు వారి పూర్వపుణ్య విశేషం వల్లనే వాటిలోంచి బయట పడుతుంటారు.  అయితే దానికి అదృష్టం లేదా విధి లాంటి పేర్లు పెట్టుకుంటారు.  అదృష్టం అంటే కనపడనిది అని అర్థం.  ఒకవేళ వారికి పరమాత్మ దిగి వచ్చి వారి పూర్వజన్మ గురించి చెప్తే?  అప్పుడు మనిషి పుణ్యం చేయడానికే తహతహలాడతాడు.  పాపం చేయడానికి వెరుస్తాడు.  ఈ ఇతివృత్తంలో నడిచే విధాత సామాన్య, ఆధ్యాత్మిక పాఠకులని సమానంగా చదివిస్తుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good