''ధన సంపాదన నవలయింది...సాహసగాథగా ఉత్కంఠ రేపింది...జీవితాన్ని గురించి, డబ్బు గురించి మీ దృక్పథాన్ని శాశ్వతంగా మార్చివేస్తుంది''. - రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా

మనిషి, డబ్బుల స్వభావాన్ని గురించి లోతైన రహస్యాలను విప్పి చెప్పే సాహసోపేతమైన కథ మెహ్రాబ్‌ తాజా పుస్తకం.

శక్తి ఉడిగిపోయి డబ్బును ఊడ్చేసి మధ్యతరగతి జీవితంతో విసిగిపోయిన డాక్టర్‌ జాన్‌పింటో రద్దీగా ఉన్న రోడ్డు మీద ఏదో ఒక వాహనం కింద పడి చనిపోవాలనుకున్నాడు. కానీ జీవితం అతని కోసం కొన్ని ప్రణాళికలు వేసి ఉంచింది. అదృష్టం అందంగా మెలికపడి జాన్‌ ప్రాణాలు కాపాడి, ప్రపంచమంతా తిరిగి ధన తీర్థయాత్ర చేసి రమ్మని పంపింది. సుడిలా తిరుగుతూ దిగ్భ్రాంతి కలిగించే విధంగాను, కొన్నిసార్లు ప్రమాదకరమైన రీతిలోనూ ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటమంటే ఏమిటో తెలుసుకున్నాడు.

చమత్కారం, కనికరం, తెలివితేటలు, ప్రగాఢమైన మానవత్వాన్ని ప్రదర్శిస్తూ చకితుల్ని చేసే నవల. సంపన్న జీవిత రహస్యాలను తెలుసుకొనడానికి జాన్‌ పింటోతో కలిసి మీరూ ప్రయాణించండి.

Pages : 200

Write a review

Note: HTML is not translated!
Bad           Good