చరిత్రలో వేమన - వేమన చరిత్ర
- తెలకపల్లి రవి
నాటికి నేటికీ తెలుగు వాడికీ వేడికీ వడికీ వరవడి వేమనే. ఆనాటికి బహుశా ఈ నాటికి కూడా వేమనతో పోల్చదగిన మరో ప్రజాకవి మనకు కనిపించరు. తమ తమ కోణాల్లో బాణీల్లో మహోన్నత శిఖరాలధిరోహించిన మహాకవులు కూడా ఆయన పదును ముందు పలుకుల ములుకుల ముందు నిలవడం కష్టం. అందులోనూ అన్ని రంగాలనూ సృశించిన వారు, అనుక్షణం గుర్తుకు వచ్చే శాశ్వత వాక్యాలు సృష్టించిన వారు మరిలేరు. తెలుగు భాషలో వేమన పద్యచరణాలు సామెతలుగా మారిపోయాయి. నానుడులుగా స్థిరపడిపోయాయి. ఎందుకంటే అవి జీవితంలోంచి వచ్చాయి. జీవితంలో నిల్చిపోయాయి. జీవితసత్యాలై పోయాయి.
ఇన్ని తరాల పాటు తెలుగుజాతికి ఉత్తేజకారకంగా నిలిచిన వేమన పద్యాలు పాడేసుకుంటున్నాం...వాడేసుకుంటున్నాం. కాని వాటి కర్త వేమన్న గురించి మనకు తెలిసిందెంత? తెలుసుకున్నదెంత? తెలుసుకోవాలనే ప్రయత్నమెంత? తెలిసిన దాన్ని తెలివిడితో ఉపయోగించినదెంత? అదైనా ఎంతకాలం తర్వాత? ఎంత కొద్ది మంఇ పరిశోధకులు, ఎంత పరిమితంగా ఆయనపై దృష్టిపెట్టారు? మరి మన నరాల్లో స్వరాల్లో భాగమై పోయిన ప్రజాకవి జీవితం పట్ల ఇంత అలసత్వం ఆలస్యం ఎందుకు ప్రదర్శితమైంది? ఈ ప్రశ్నలలోనే వేమన ఔన్నత్యం మనకు చాలా వరకూ తెలిసిపోతుంది.
పేజీలు :206