అప్పటికే ఆతను ఆమె తలని ఛాతీకి అదుముకున్నాడు.
ఆమె ఏడుపు ఉదృతం అయ్యింది.
అతని రెండు చేతులూ ఆమె చుట్టూ బిగిశాయి.
"ప్లీజ్ విజ్జీ" బలవంతంగా ముఖం ఎట్టి ఆమె య్డుస్తున్న కాళ్ళ మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. "ప్లీజ్ !... ప్లీజ్ నన్ను వదిలేయవు కదూ ! నన్ను వదిలెయ వద్దు. నన్ను ఓటరి వాడిని చేయవద్దు. ... ఐ లవ్ యు విజ్జీ ! ఐ లవ్ యు ప్లీజ్ ! యూ ఆర్ మై స్ట్రెంగ్త్ . యూ నో యిట్ ! ప్లీజ్ ! నా కోసం ఒర్చుకోమ్మా.. కొద్ది రోజులు భగవతుడి మనల్ని అన్యాయం చేయడు . మనిద్దరం అందరిలా హాయిగా వుందాం . ప్రేమకి ముగింపు సంతోషమే గాని బాధ లేదు అని నీకు ఎన్నిసార్లు చెప్పాను ! ప్లీజ్ ! నన్ను వదిలేయద్దు . వదిలేస్తే నేను చచ్చిపోతాను నాకెవ్వరూ లేరు. నన్ను వదిలెయవద్దు. తెలిసిందా !" ఆవేశంగా అన్నాడు.
ఆతను ఆమెని బ్రతిమాలుతున్నాడు. ప్రేమగా బుజ్జగింపు గా చెబుతున్నాడు. ఆవేశంగా అంటున్నాడు.
అతని చేతుల మధ్య ఉన్న ఆమె ఏడుపు ఆగిపోయింది. అతని మాటలు ఆమెను చకితురాల్ని చేస్తున్నాయి. ఏమిటి ఈ మాటలు ? విజయ్ కి ఆపరేషన్ సంగతి తెలిసిందా ? మై గాడ్ ! ఆమెని ఆందోళన వచ్చేసింది.
ఆమె వైజయంతి . న్యూరాలజీ లో స్పెషలైజైషన్ చేసిన డాక్టర్. అతడు ఒక రైలు ప్రమాదంలో గాయపడిన ఓ అపరిచితిడు. అతడికి తన గతం గుర్తు లేదు. తానెవరో కూడా తెలియని అతడికి విజయ్ అంటూ పేరు పెట్టి ట్రీట్ మెంట్  మొదలు పెట్టారు. అతడు ఒకనాడు పార్క్ లో మల్లికా అనే పన్నెండేళ్ళ పాపని కాపాడి ఇంటికి తీసుకు వస్తాడు.
ఆ అనాధ బాలికతో అతడికి అనుబంధం పెరుగుతుంది అతడే ఆ చిన్నారికి తల్లి తండ్రీ గురువూ స్నేహితుడూ అవుతాడు. కథ మరెన్నో మలుపులు తిరుగుతుంది. అనుబంధాలూ ఆత్మీయతల చుటూ అందంగా అల్లిన తెలిమల్లె పందిరి యద్దనపూడి సులోచనా రాణి వెన్నెల్లో మల్లిక

Write a review

Note: HTML is not translated!
Bad           Good