Rs.150.00
Out Of Stock
-
+
''ఓస్ ఈ మాత్రానికేనా!? సిల్లీగా లేదూ'' అని మనం చచ్చేంతగా నవ్వుకోవచ్చు కానీ ఆ అమాయకురాలి బాధ, వేదన, ఆక్రోశం, ఎమోషన్స్ చదువుతుంటే ఆ అమ్మాయి బాధ 'నిజమే కదా' అని అన్పిస్తుంది.
నేటి ఆధునిక ప్రేమలు, డేటింగ్‌లూ, ఆన్లైన్ స్నేహాలు, మొబైల్ ఛాటింగ్‌లు, విడాకుల మధ్య ఓ పిచ్చితల్లి అమ్మ్మ ఒళ్ళో తల పెట్టుకుని 'మా ఆయన నేను రాసిన ప్రేమలేఖ చదవలేదు అమ్మమ్మా!' అని కుమిలి, కుమిలి ఏడుస్తుంటే మనకూ ఏడుపొస్తుంది.
జీవితం వ్యాపారం అయిపోయాక...
మానవ సంబంధాలు డెబిట్, క్రెడిట్ లెఖ్ఖలైపోయా...దేన్నీ పట్టించుకునే 'తీరిక' లేనంత బిజీ ఉరుకుల పరుగుల మధ్యఓ అమ్మమ్మ, తాతయ్య, మనవరాలు...ఇంకా..ఈ రోజుల్లో వెన్నెలో కూర్చుని మల్లెపూల మాల కట్టుకుంటూ 'జీవితాన్ని' అస్వాదిస్తున్నారు.
కాస్త తీరిక వుంటే..మీరు వినండి...మనం 'ఏం కోల్పోతున్నామో!!? అర్ధం అవుతుంది...