చదరంగంలో అవతలి వారి ఎత్తులకు పై ఎత్తులు వేసి చిత్తు చేసే రేవంత్ తతిమ్మా విషయాల్లో ఉత్త అమాయకుడు. అట్లాంటి ఒక అమాయక జీనియస్‌తో టెలిఫోన్ తీగలమీద ఒక అందాల భరిణ అల్లరి ప్రేమ సాగుతుంది. మెరుపుకి మల్లే మెరిసి మాయమైపోయే ఆ గడుగ్గాయిని పట్టుకోవటానికి రేవంత్ పడని పాట్లుండవు. కష్టాల్లో వున్నప్పుడు వెన్ను దట్టి ముందుకు నడిపే ఆ యువతి ఎవరో రేవంత్ తెలుసుకుంటాడా ? దీనికి ఆమె యిచ్చిన గడువు నెలరోజులు. అది పూర్తవటానికి 118 నిమిషాలు మాత్రమే ఉంది. అవతల విమానం బయద్దేరటానికి రెడీగా వుంది. అప్పుడు వచ్చింది అతడికి ఫ్లాష్‌లాంటి ఆలోచన.... కదిలే విమానం ఆగిపోయింది. మైక్‌లో అతడి కోసం ఒకపక్క అనౌన్స్మెంట్లు. అతడు మాత్రం తాపీగా ఫోన్ చేస్తున్నాడు. మొత్తం టెలిఫోన్ డిపార్ట్మెంట్ అంతా వలవేయబడింది. చివరి క్షణంలోనైనా అతడికి ఆమె నెంబర్ దొరికిందా ? క్షణ క్షణం మిమ్మల్ని సస్పెన్స్‌లో పెట్టి, పూర్తయ్యాక ఒక మధురభావాన్ని మనసులో నింపే నవల.
Rs.90.00
In Stock
-
+