రాత్రి -

మలిఝాము దాటింది. ఆకాశంలో పిల్లలకోడీ, గొల్లకావిడా నడినెత్తికొచ్చి అటుగా ఒదిగిపోతున్నయ్. ఆ చీకట్లో దూరంగా, నిండుగా ప్రవహిస్తోంది గోదావరి తల్లి.

సుదూరంగా వున్న పచ్చని ఎత్తయిన కొండలు ఆ రాత్రిలో నల్లగా, అస్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటిమీంచి వీచే పిల్లగాలి, గోదావరి మీదికి ప్రసారమై సుడిగాలిలా రూపాంతరం చెంది గోదావరి నీళ్ళని ఆటలు పట్టించి అలలుగా మారుస్తోంది.

చల్లటి ప్రశాంతమైన ఆ రాత్రివేళ గోదావరి మధ్యలో "డుబ్ డుబ్  డుబ్ డుబ్" మన్న శబ్దం  అస్పష్టంగా వినిపించసాగింది. గోదావరికి బాగా అలవాటయిన, కొత్తవాళ్ళకి బాగా కొత్తయిన ఆ శబ్దం కొన్ని క్షణాలకి స్పష్టాతిస్పష్టంగా వినిపించసాగింది. తీరా చూస్తే-

రాత్రివేళలు ప్రయాణంచేసే రూటు లాంచీ అది. నది నీటి పోటుకి ఎదురీదలేక దాని "డుబ్ డుబ్" శబ్దాన్ని మరింత పెంచుతోంది నిండు గర్భిణిలాంటి ఆ లాంచీ.

లాంచీలో వున్న పది పన్నెండుమంది ప్రయాణీకుల్లో ముగ్గురునల్గురు నిశ్చింతగా నిద్రపోతున్నా తక్కినవాళ్ళంతా జాగరణ చేస్తూనే వున్నారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good