వేమూరి రాధాకృష్ణమూర్తి, గుంటూరు జిల్లా కూచిపూడి గ్రామంలో జన్మించారు.

హైదరాబాదు - దక్షిణ భారత హిందీ ప్రచార సభలో 32 సంవత్సరాలు, మద్రాసు - దక్షిణ భారత హిందీ ప్రచార సభ ప్రధాన కార్యదర్శిగా మూడు సంవత్సరాలు పనిచేసి దక్షిణ భారత దేశమంతటా హిందీ ప్రచారానికి ఎనలేని కృషి చేశారు.
మూడు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్‌ హిందీ అకాడమీ అధ్యక్షులుగా పనిచేసి అనేక కార్యక్రమాలు నిర్వహించి హిందీ అకాడమీకి ప్రజల గుర్తింపు తెచ్చారు. హిందీ ఉపాధ్యాయులుగాను, హిందీ లెక్చరర్లుగాను, హిందీ ఆఫీసర్లుగాను, హిందీ ప్రచారకులుగాను పనిచేస్తున్న సుమారు 2000 మంది ప్రముఖ పండితులకు హిందీలో ఉన్నత ఉపాధ్యాయ శిక్షణ నిచ్చి వారి మన్ననలందుకున్నారు. హిందీ - తెలుగు భాషల్లో రచయితగాను, అనువాదకులుగాను, అభినేతగాను అనుభవం గడించిన వీరికి, వీరి గ్రంథాలకు, హిందీ ఉద్యమంలో వీరు చేసిన అవిరళ కృషికి - భారత ప్రభుత్వం మరియు ప్రసిద్ధ సంస్థల ద్వారా అఖిల భారతస్థాయిలో పలు విశిష్ట బహుమతులనందుకున్నారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good