'ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే' పేరిట ప్రతి ఆదివారం ఏబీఎన్‌ చానెల్‌లో ప్రసారమయిన ప్రముఖుల ముఖాముఖీలను పుస్తక రూపంలో వెలువరించారు.

ఆగస్టు సంక్షోభం వస్తుందని నాకు ముందే అనిపించింది. పొద్దున్న వస్తూనే రామకృష్ణ స్టూడియో సిద్ధం చేసి ఉంచాలని చెప్పాను. అమెరికా నుంచి వస్తున్న ఎన్టీఆర్‌ను రిసీవ్‌ చేసుకోవడానికి వెళ్ళాం. అక్కడి పరిణామాలు చూస్తే ఏదో జరగబోతుందని అనిపించింది. - నారా చంద్రబాబు నాయుడు

అన్ని పార్టీలకు, మా పార్టీకి భిన్నత్వం ఉంది. మాది పంచకూట కషాయం. నక్సల్స్‌ నుంచి వచ్చిన వారున్నారు. ఆరెస్సెస్‌లో పనిచేసినవారూ ఉన్నారు. కొందరు టీడీపీ నుంచి వచ్చారు. అందరూ వారి కోణంలో నానుంచి ఆశిస్తారు. ఇది అసాధ్యం. - కె.చంద్రశేఖరరావు

డాక్టర్‌కు మానవతా దృక్పథం ఉండాలి. తానెందుకు ఈ వృత్తిలోకి వచ్చానన్న స్పష్టత అవసరం. - డా.నాగేశ్వర్‌ రెడ్డి

రాజకీయ కోణం వైపు నేను ఎప్పుడూ చూడలేదు. నా దృష్టంతా కావ్యరచన పైనే. - సి.నారాయణ రెడ్డి

Write a review

Note: HTML is not translated!
Bad           Good