వేమన్న ఏమన్నాడు ? - కె.   శరత్‌చంద్ర జ్యోతిశ్రీ

ఎంపిక చేసిన 349 పద్యాలను వేమన్న ఏమన్నాడు!, వేమన తాత్వికత, వేమన తిరుగుబాటు అనే మూడు భాగాలుగా విభజించి ఇందు ఇస్తున్నాను. 1839 సంకలనంలో లేనివి. ప్రాచుర్యం పొందిన కొన్ని పద్యాలను వేమన్న ఏమన్నాడు, వేమన తిరుగుబాటు విభాగాల చివరన చేర్చాను. పద్యాలకు సీనియర్‌ పాత్రికేయులు జి.వి.ఎల్‌. నరసింహారావు సహకారంతో భావాన్ని ఇచ్చాను. 'వేమన గురించి' రాసినదానిలో చరిత్రకారులు, పరిశోధకుల అభిప్రాయాలను అనుసరించిన సమాచారాన్ని పొందుపర్చాను. 'ఎవరేమన్నారు?' శీర్షిక కింద దేశి-విదేశీ సాహితీవేత్తలూ, పరిశోధకులు వెల్లడించిన అభిప్రాయాలు, విశ్లేషణలు, విమర్శల నుండి కొన్ని ప్రధానమైన అంశాలను పొందుపర్చాను. ఇవి వేమనను తెలుసుకొనేందుకూ అర్థం చేసుకునేందుకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను.

Write a review

Note: HTML is not translated!
Bad           Good