వేమన ఒక తాత్త్విక విజ్ఞాన సర్వస్వం, సకల సామాజికానుభవ స్వారస్యం. వేమన పద్యాలు తెలుగులో ఉండటం వల్ల ఆ తెలుగు మన మాతృభాష అయినందుకు నేనెంతో గర్విస్తున్నాను. రాతిబాటల్లో జాతిరత్నాలు వెదజల్లిన అపురూపమైన మహాకవి వేమన, నీతుల నీరనిధులు పొంగించిన సామాజిక ప్రవక్త. సుదీర్ఘరోగానికి చేదు మందులిచ్చే వైద్యుడిగా, తీరాన్ని గానం చేసే నావికుడిగా వేమన మనకు సాక్షాత్కరిస్తాడు. - గోపి

అంకిలెరిగి మాటలాడ నేర్చినపుడె

పిన్న పెద్ద తనములెన్న నేల?

పిన్నచేతిదివ్వె పెద్దగా వెలగదా!

విశ్వదాబిరామ వినురవేమ.

తాత్పర్యం : సందర్భమెరిగి మాట్లాడగలిగినపుడు వయస్సులో చిన్నవాడా పెద్దవాడా అని చూడకూడదు. చిన్నవాడయినా కొట్టి పారెయ్యగూడదు. ఎందుకంటే కుర్రవాడి చేతిలోని దీపం కురుచగా వెలుగుతుందా? పెద్దగా వెలగదా? అని ఎదురు ప్రశ్నిస్తున్నాడు వేమన. జ్ఞానానికి వయస్సుల తారతమ్యంతో పని లేదు. జ్ఞానం జ్ఞానమే.

పేజీలు : 500

Write a review

Note: HTML is not translated!
Bad           Good