మహా పండితుడు రాహుల్‌ సాంకృత్యాయన్‌ అభిప్రాయం ప్రకారము, బుద్ధుడు సమాజములోని కులవ్యవస్థను తొలగించవలెనని కోరాడు. ఆనాటి రాచరిక వ్యవస్థకు ఆర్థిక విధానానికి వ్యతిరేకి కాదు. అందుచే అనేక మంది రాజకుమారులు, బ్రాహ్మణ పండితులు వర్తక ప్రముకులు, తమ రాజ్యాధికారాన్ని మేధాశక్తిని ధనపుసంచులను ఆయన పాదాల ముందు గ్రుమ్మరించినారు.

మధ్య యుగంలోని తత్వవేత్లఉ, భక్తులు రాచరిక వ్యవస్థకు, కులవ్యవస్థకు వ్యతిరేకులు. వీరిలో చాలామంది ఆనాటి రాజుల, సుల్తానుల ఆగ్రహానికి గురియైనారు. కబీరు, నానక్‌, రామానుజుడు, బసవన్న మున్నగు వారు, వేమన కుల, మత, రాచరిక వ్యవస్థలకు మూడింటికేగాక, ఆనాటి ఆర్థిక విధానానికి కూడా వ్యతిరేకి. పైవారి కంటే ఈయనలో భక్తి పరమితితం, జ్ఞానం అపరిమితం. సమాజములోని అజ్ఞానాన్ని, అవినీతిని పెంచి పోషించుచున్న అన్ని దోపిడీ వర్గాలను ప్రతిఘటించినాడు, ఇందువల్ల వేమన్న పై వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన వలసి వచ్చింది. కర్నాటకలో బసవన్న వలెనే, వేమన్న సాహిత్యాన్ని ఆశ్రయించి, ప్రజలను ఆకట్టుకోవలసి వచ్చింది.

పేజీలు :64

Write a review

Note: HTML is not translated!
Bad           Good