తెలుగు సాహిత్య చరిత్రలో మధ్యయుగానికి చెందిన కవి వేమన. క్రీ.శ. 17వ శతాబ్దంలో జీవించి, తెలుగు నేలపైన సంచరించి ప్రజల జీవితాన్ని దగ్గరగా పరిశీలించి ప్రజలభాషలో పద్యాలు చెప్పిన కవి వేమన. ప్రజాకవి, లోకకవి, విశ్వకవి, యోగి, మనవేమన-వంటి మాటలతో తెలుగు ప్రజలు వేమనను సొంతం చేసుకున్నారు. వేమన ఆధునిక తెలుగు సమాజానికి తెలియకముందే 1730లో ఫాదర్‌ లీగార్‌ అనే క్రైస్తవమతగురువు అనంతపురం నుంచి వేమన పద్యాలను ప్యారిస్‌లోని కింగ్స్‌ గ్రంథాలయానికి పంపించాడంటే, అప్పటికే ఆయన పద్యాల ప్రాశస్త్యం ఎంతటిదో మనకు తెలుస్తుంది.

వేమన తన పద్యాలలో చిత్రించిన సామాజికాంశాలలో చాలా భాగం ఇంకా కొనసాగుతున్నాయి. వాటినిర్మూలనకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. 104 ఉపహ్రాలను ఒకేసారి ప్రయోగించగల వైజ్ఞానిక విప్లవ వాతావరణం ఒకవైపు, కాలంచెల్లిన భావాలు అభిప్రాయాలు ఆచారాలు మరోవైపు రాజ్యమేలుతున్న సందర్భంలో మరోసారి వేమనను అధ్యయనం చేయడం అవసరం.

 "రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ" (1893- 1979) సంస్కృత, ప్రాకృత, కర్ణాటక భాషా పండితులుగా సంగీత విద్వాంసులుగా ప్రసిద్ధికెక్కిన రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు మైసూరు పహారాజ కళాశాలలో తెలుగు పండితులుగాను, తిరుపతి దేవస్థానంలో అన్నమాచార్యుల రచనల పరిష్కర్తగాను, వ్యవహరించారు. వీరు 1928లో అనంతపురం నందు వేమన పై ఇచ్చిన సుప్రసిద్ధ ఉపన్యాసాల సంకలనమే ఈ గ్రంథం.

పేజీలు : 176

Write a review

Note: HTML is not translated!
Bad           Good