వేమన పద్యాలకు బహుళ ప్రచారం లభించటానికి కారణాలు చాలా ఉన్నాయి. సామాన్య నీతులను ప్రజల హృదయాలకు హత్తుకొనేటట్లు వారికి పరిచితమైన భాషలో, స్పష్టమైన రీతిలో సూటిగా, తేటగా, శక్తివంతంగా వ్యక్తీకరించటం, సామాన్యులైన వారిలో తనను ఒకనిగా భావించుకొని నీతి ఉపదేశం చేయటం వేమన నీతులలోని ప్రధాన గుణం. సునిశితమైన హాస్య, వ్యంగ్య, అధిక్షేప చమత్కృతులతో కల్పించి, నవ్వించి ఎదుటివారి లోపాలను, తన లోపాలను, గుర్తెరిగి ఉపదేశించిన రీతిని గమనించేటట్లు చేసే శైలిని ఆయన ప్రదర్శించాడు. ఆయన ప్రౌఢకల్పనల జోలికి పోలేదు. సామాన్యాలు మనోజ్ఞాలు అయిన ఉపమాన దృష్టాంతాలతో సూక్తిప్రాయంగా నీతులను బోధించాడు.

వేమన తన తప్పులను తెలుసుకొని పశ్చాత్తాపం చెందినవాడు. నిజ జీవితానుభవంలోని అంశాలను గూర్చి కూడా ఆయన నీతులను ఉపదేశించాడు.

ఇంటియాలు విడిచి యిల జారకాంతల

వెంట దిరుగువాడు వెఱ్ఱివాడు

పంటచేను విడిచి పరిగియేరిన యట్లు

విశ్వదాభిరామ వినుర వేమ!

అంటాడు. వేమన పోతనవలె సహజ పాండిత్య శోభితుడు. యోగ విద్య కోసం మాత్రమే అతడు గురువులను ఆశ్రయించాడు. కానీ భాషా పాండిత్యానికి కాదు. అతనిది శ్రుత పాండిత్యం మాత్రమే అయితే అది మిశ్రుత పాండిత్యంగా భాసిల్లింది.

పేజీలు : 59

Write a review

Note: HTML is not translated!
Bad           Good