18వ శతాబ్దంలో రాజకీయ, సాంఘిక కారణాల వలన మోడుబారుతున్న తెలుగు భాషకు జీవప్రతిష్ట చేసిన మహానుభావులు సి.పి.బ్రౌన్. కలకత్తాలో పుట్టిన ఈ ఆంగ్లేయుడు జీవితకాలం తెలుగు భాష పునరుజ్జీవనానికి విశేష కృషి చేసారు. తన స్వంత ఆదాయంలో నుంచే 2106 చేతి వ్రాతలున్న రచనలు సేకరించారు. వాటన్నింటిని చెన్నై గ్రంథాలయానికి పంపించారు. 1820లో అప్పటి మద్రాస్ గవర్నర్ మున్రో ప్రతి కలెక్టర్ స్థానిక భాష నేర్చుకుని తీరాలన్న నిబంధన విధించడం వలన బ్రౌన్ తెలుగును స్థానిక భాషగా ఎంచుకుని 1820లో సివిల్ సర్వీస్ పరీక్షను, తెలుగు పరీక్షలో కూడా ఉత్తీర్ణులయ్యారు. మచిలీపట్నం, రాజమండ్రి, గుంటూరులలో కలెక్టరుగా పనిచేసారు. ఆ సమయంలోనే తెలుగు భాషపై పట్టుసాధించారు. నిఘంటువు గ్రామర్ పుస్తకంతో సహ అనేక పుస్తకాలు ప్రచురించారు. స్వయంగా ఎన్నో వ్యాసాలు, పరిశోధనలు చేసారు. 1164 వేమన పద్యాలను 1839లో సేకరించి వాటిని ఆంగ్లంలోకి అనువదించారు. బ్రౌన్ భాషాప్రియుడు అవడం వలన గ్రీక్, లాటిన్, ప్రష్యన్, సంస్కృతం కూడా నేర్చుకున్నారు. ఆంధ్రులకు బ్రౌన్ సేవలు చిరస్మరణీయం.
పేజీలు :239