Rs.40.00
In Stock
-
+
ప్రాచీన తెలుగు కవులలో వేమన నిస్సందేహంగా విశిష్టమైన కవి. అతికొద్ది మంది ప్రాచీన కవులను రాజాస్థాన కవులని, ఆస్థానేతర కవులని విభజించుకుంటే ఆస్థానేతర కవులలో వేమన ప్రముఖుడు. మార్గ, దేశి కవులుగా విభజించుకుంటే వేమన అచ్చమైన దేశికవి. అనువాద, మౌలిక కవులుగా విభాగించుకుంటే, వేమన కల్తీలేని మౌలికకవి. పౌరాణికక, సాంఘిక కవులని విభజించుకుంటే వేమన స్పష్టమైన సాంఘిక కవి. ప్రౌఢ, సరళ కవులని విడదీసుకుంటే వేమన అత్యంత సరళమైనకవి. యథాతథ, తిరోగమన, పురోగమన కవులుగా విడదీసుకుంటే వేమన నిస్సందేహంగా పురోగమనకవి. ''కవి ప్రవక్తా కాలంకన్నా ముందుంటారు''. అన్న గురజాడ మాటకు ప్రాచీన తెలుగు కవులలోంచి ఒక్క కవిని ఉదాహరించాలంటే వేమనే కనిపిస్తాడు.
పేజీలు : 64