ఇంటింటి పద్యాలకు

ఇంతులంటే ఇంత ద్వేషమా

             మందరపు హైమావతి

     ప్రజాకవిగా పేరెన్నిక గన్న వేమన జనాభాలో సగభాగం ఉండే స్త్రీలను యథేచ్ఛగా దూషించాడు. నిత్య జీవిత సత్యాలను నిర్భయంగా చెప్పి సామాన్య ప్రజల హృదయాలను కొల్లగొట్టిన వేమన స్త్రీల మీద చెప్పిన ఒక్కొక్క పద్యం వారి దేహాలపై ఝళిపించిన ఒక్కొక్క కొరడా దెబ్బ వారి గుండెల్ని మండించిన గాయాలు జ్వాల. వేలాదిగా ఉన్న వేమన పద్యాలను పరిశీలిస్తే అతడు స్త్రీల పట్ల చేసిన దూషణ అనేక సందర్భాలలో అనేక విధాలుగా కనుపిస్తుంది.

స్త్రీలు పట్ల అల్పభావం :

     పితృస్వామ్య యుగ లక్షణం పురుషాధిక్య స్వభావం. స్త్రీలు ఎంత విశిష్టగుణ వరిష్ఠులైనా పురుషుల కంటే తక్కువే. స్త్రీల ప్రవర్తనను, జీవన విధానాన్ని సంఘమే శాసిస్తుంది. నియమాల పంజరాలు నిర్మిస్తుంది. నిషేధాల వలయాలు సృష్టిస్తుంది. దానికి తగినట్టుగా మతం, సాహిత్యం స్త్రీల నడవడికను నిర్దేశిస్తాయి. వేమన స్త్రీల విషయంలో మాత్రం ఆ పితృస్వామ్య యుగ లక్షణాలను పుణికి పుచ్చుకున్నాడు.


పేజీలు : 88

Write a review

Note: HTML is not translated!
Bad           Good