వేమన కవిత్వంలో క్రీ.శ. 17వ శతాబ్దం నాటి సామాజిక పరిస్థితులు - ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, తాత్విక పరిస్థితులు - ప్రతిబింబిస్తున్నాయి. అప్పటి మానవ సంబంధాలు, వాటిని నడిపిస్తున్న శక్తులు ఆయన కవిత్వంలో మనకు దర్శనమిస్తాయి. వేమన తన కవిత్వంలో ప్రస్తావించిన, విమర్శించిన అనేకాంశాలు ఏదో ఒక రూపంలో - యధాతథంగాగాని, రూపం మార్చుకొనిగాని, మరింతముదురు రూపంలోగాని - ఇంకా మన సమాజంలో కొనసాగుతూనే ఉన్నాయి. సాంఘిక వివక్షలు, ఆర్తిక అసమానతలు, రాజకీయ రుగ్మతలు, దొంగ గురువులు, సాంస్కృతిక మరుగుజ్జుతనం, మానవస్వార్థం, దురలవాట్లు, విగ్రహారాధన, సామాజిక సంఘర్షణలు, మానసిక కల్మషాలు, విలువల పతనం, ఆడంబరాలు, కక్షలు, కార్పణ్యాలు సమాజానికి ఎంత హాని చేస్తాయో నాలుగవందల ఏళ్ళ క్రితమే గుర్తించి హెచ్చరించిన వైతాళిక కవి వేమన. ఇవి ఇలాంటివి మన సమాజంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే వేమన ఈనాటి అవసరం.
పేజీలు : 112