వేమన బోధ - జి.వి. సుబ్రహ్మణ్యం

''తిక్కనగాని, వేమనగాని, గురజాడగాని రాసిందంతా ఆద్యంతం నాటకం. నాటకంలోనే కవిత్వం పరాకాష్ఠ అందుకుంటుంది. వేమన్న రాసిన ప్రతి పద్యం ఒక నాటకం. ఆ మాటకొస్తే వేమన్న జీవితమంతా ఒక నాటకమే. ఆటవెలది ఛందస్సు అతడి నాటకరంగం. నాలుగు పాదాలలో ''విశ్వదాభిరామ వినురవేమ'' అని ఆఖర్ని అనక తప్పదు కదా! ఇక అతనికి మిగిలినది మూడే పాదాలు. ఆ మూడు పాదాలలో మూడు లోకాలకి ముళ్ళుకట్టిన వేమన్నని మహాకవిగా గుర్తించని వాళ్ళు వెర్రివాళ్ళు. సాధారణంగా వేమన తన పద్యంలో ఏం చేస్తాడంటే మార్క్స్‌ చెప్పిన ుష్ట్రవరఱర, ూఅ్‌ఱ ుష్ట్రవరఱర, ూవ్‌ష్ట్రవరఱర చూపిస్తాడు. మొదటి పాదంలో సంగతి చెబుతాడు. సరీగా దానికి వ్యతిరేకమైన భావాన్ని రెండోపాదంలో చెబుతాడు. ఈ రెండూ ఒకదానితో ఒకటి పోరాడుతూ ఉండే మూడోపాదంలో తానుగా సాక్షాత్కరించి సమన్వయం చేస్తాడు. వేమన పద్యాలను భిన్న కోణాల నుంచి విశ్లేషించిన మంచి పుస్తకం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good