తనేమిటో
తెలుసుకున్నవాడికి
అంటదు
అహం.
నిప్పుకి -
చెదలా?
భౌతిక ప్రపంచమూ
అంతరంగిక యుద్ధమూ
జయించిన
తర్వాత..?
మనిషి మ¬త్కృష్టదశ
శాంతి:
రెక్కలు - అంటేనే పైకెగరడానికి కారణమయేవి. అంటే, సాధారణమైన భావాన్ని ఉదాత్తమైన పరిధిలోకి తీసుకువెళ్ళేవి. అందుకే 'రెక్కలు'లో ఎన్ని బావాలు చెప్పినా, జీవనసత్యాలు, తాత్వికభావన ప్రాధాన్యం వహిస్తాయి. ఎన్నో కోణాల్లో వీటిని సాధించడమే ఈ రూపంలోని శిల్పవిశేషం. శ్రీనివాస్ గౌడ్ చాలా సమర్థంగా 'రెక్కలు'లో ఈ కార్యం నెరవేర్చాడు. - డా|| అద్దేపల్లి రామమోహనరావు
వచన కవితలు రాసినా, మినీకవితలు రాసినా, హైకూలు రాసినా, నానీలు రాసినా, ఇప్పుడు 'రెక్కలు' రాసినా ముందు కవిత్వం కావటం ముఖ్యం. పి.శ్రీనివాస్‌గౌడ్ ఈ విషయంలో బాగానే జాగ్రత్త పడుతున్నారు. అందుకే అతనికి శుభాభినందనలు. - డా|| రావి రంగారావు
ఒకానొక సన్నివేశంలోంచి తలొంచి ప్రయాణించడం, అందులోని కష్టసుఖాలను అనుభవించడం, గ్రహించిన సత్యాన్ని రాగద్వేషాలకు అతీతంగా, నిరాడంబరంగా ఆవిష్కరించడం 'రెక్కలు'లోని తత్వం. నైతిక పతనం అడుగడుగున తారసపడుత్ను విషాదంలో మనిషి తనను పునర్నిర్మించుకోవాలన్న విచక్షణకు దూరంగా, బాధ్యతారహితంగా జీవించడం శోచనీయమే. కాలప్రవాహంలో ఇసుకగూళ్లుగా కొట్టుకుపోయే నిర్మాణాలపై వ్యామోహం వదలి, వేయి తరాలకు పరిమళం పంచే మనిషిగా మనిషి మేల్కోవాలి. - యం.కె.సుగమ్‌బాబు