''విజయానికి అయిదు మెట్లు'' నుంచీ ''టీన్స్‌ పిల్లల పెంపకం'' దాకా నా వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లో, .... పాటూ నా అనుభవాలూ, కథలూ కూడా వ్రాస్తూ వచ్చాను. మిగతా రచయితల పుస్తకాలకీ, వీటికీ తేడా బహుశా ఇదే అనుకుంటాను.

దురదృష్టవశాత్తూ, ఇటువంటి పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ పుస్తకాలు పిల్లలు చదవరు. కానీ ఈ పుస్తకాల్లో కొన్ని కథలు పిల్లలకి ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ ఇస్తాయి. అన్నిటినీ క్రోడీకరించి ఒక చోట చేరిస్తే, వాటిని పిల్లలు తెలుసుకునే అవకాశం ఉంటుందనే ఆలోచనే ఈ పుస్తకం.

నా వివిధ వ్యక్తిత్వ పుస్తకాల్లో నుంచి ఏరి కూర్చిన కథల సమాహారం ఇది. ఇందులో కొన్ని విదేశాలకి సంబంధించిన పురాతన గాధలు, మరి కొన్ని బౌద్ధానికి సంబంధించిన పుస్తకాల్లోంచి, ఇంకా కొన్ని ఇంటర్నెట్‌ నుంచీ స్వీకరించినవి. చాలా వరకూ నావి.

పెద్దలు పిల్లలకి బెడ్‌రూం కథలు చెప్పటం తగ్గిపోయింది. 'అసలు మాకు తెలిస్తే కదా చెప్పటానికి' అంటున్నారు కొందరు. ఈ పుస్తకం ఆ లోటు తీరుస్తుంది. - యండమూరి వీరేంద్రనాథ్‌

పేజీలు : 232

Write a review

Note: HTML is not translated!
Bad           Good