వీరబ్రహ్మంగారు బాల్యంలోనే బనగానపల్లెలో గరిమిరెడ్డి అచ్చమ్మ గారింట పశుపాలన జేసినారు. బ్రహ్మంగారికి వేదవిద్య కరతలామలకం. ఈ విద్య వల్ల ఆయన సమస్త సుఖభోగాలను అనుభవిస్తూ అష్టైశ్వర్యాలతో తులతూగలేదు. ఉత్తమ ధర్మమైన శిల్పకర్మ నాచరించి తన కుటుంబాన్ని పోషించారు. సారస్వత విద్యకు కర్మవిద్యల తోడ్పాటుంటేగాని మానవజీవితం చరితార్థం కాదని తలచి దీనిని తన జీవితంలో ఆచరించి మార్గదర్శకుడయ్యారు.

ఆచార్య సి.నారాయణ రెడ్డి గారు చెప్పినట్లు ''బ్రహ్మంగారు పద్యాలైనా, కీర్తనలైనా ఆషామాషీగా రాయలేదు. కవితాబల ప్రదర్శన చేయడం కూడా ఆయన ఉద్దేశం కాదు. కవిత్వానికి సాంఘిక ప్రయోజనముండాలని ధృఢంగా నమ్మినవాడు కాబట్టే తీండ్రమైన కవిత గండ్రగొడ్డలిలాగ ప్రయోగించాడు. స్వార్థమతులను, మృషామతులను గడగడలాడించారు.

కులమనేటి తెగులు కొంపలు గూల్చును...

మతము మత్తుగూర్చు మార్గమ్ము కారాదు...

అంటూ కులమత భేదాలు నశిస్తేగాని నీరసించిన భారతజాతి సంస్కరింపబడదని తలచి దేశం నాలుగు చెరగులా తిరిగి ధర్మబోధ గావించారు...

పేజీలు : 88

Write a review

Note: HTML is not translated!
Bad           Good