శవాన్ని పక్క గదిలో వదిలి, అంబులెన్స్‌కి ఫోన్‌ చేసి ఇన్‌స్పెక్టర్‌ వెనక్కి తిరిగి వచ్చేసరికి కుర్చీలో కూర్చున్న భంగిమలో బట్టలూ, క్రింద చెప్పులూ అలాగే వున్నాయి. శరీరం మాత్రం క..రి..గి పోయినట్టు మాయమైంది.

మరోవైపు-అతడి భార్య ఎదురింటి వాడితో వెళ్ళిపోయింది. అతడు తన గర్ల్‌ఫ్రెండుని హత్య చేసిన నేరంలో ఇరుక్కుపోయినప్పుడు - మళ్ళీ ఆ ఎదురింటి మహర్షే రక్షించాడు.

డబ్బూ, పేరూ, కీర్తీ వున్న తనని వదిలేసి 'శాంతి' మరొకరితో ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసుకోవటం కోసం చేసే అన్వేషణలో అతడు తన బ్రతుక్కి అర్థం తెలుసుకున్నాడు.

'అంతర్ముఖం' 'తులసీదళం' 'వెన్నెల్లో ఆడపిల్ల' మొదలైన వివిధ రంగాలకు సంబంధించిన నవలల్ని అత్యుత్తమంగా సృష్టించిన శ్రీ యండమూరి వీరేంద్రనాథ్‌, దశాబ్దపు విరామం తర్వాత వ్రాసిన ఈ అబ్సర్డ్‌ థ్రిల్లర్‌ మొదటి పేజీ నుంచీ చివరి వరకూ ఏకబిగిన చదివిస్తుంది. చదవటం పూర్తయ్యాక మనసు మీద మరపురాని ముద్ర వేస్తుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good