వీరాజీ రచనలో భాషా సౌకుమార్యంతో పాటు, బావ మృధుత్వం, వర్ణనా కౌశల్యం, సహజత్వం వున్నవి - యీ ప్రత్యేకతలు పాఠకునిచే రచనని ఒక్క బిగువున చదివించగలుగుతాయి. - ఏటుకూరి బలరామమూర్తి
వీరాజీ కలం మంచి పరువంగా అందంగా నడుస్తుంది... పాఠకుణ్ణి తనతో పరెగెత్తించే ప్రతిభ వీరాజీలో పుష్కలంగా వుంది. భాషలో సైతం రచయిత ప్రత్యేకం. ఆ విరుపులు, విణ్ణానాలు కొత్తగా వున్నాయి! - శార్వరి