ఆమె నర్సు; పేరు క్రాంతి; మంచితనం, దయ, జాలి, ఔదార్యం, సేవానిరతి ఆమె సొత్తు; చల్లనిచేతి స్పర్శతో కరుణపూరిత నయనాలతో ఎందరో రోగుల్ని బాగుచేసింది. ''చల్లని తల్లి'' అని పదిమందిచేతా పిలిపించుకుంది.

అతను అజ్ఞాత జీవితానికి అంకితమైన ఓ యువకుడు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం, ప్రాణాలర్పించేందుకు సిద్ధపడిన వేన్‌గార్డ్‌; ఉద్రేవి; పేరు సింహా;

పరిస్థితులు ఊరట కలిగించిన క్రాంతి, సింహాను ఆదరించింది. సేదతీర్చింది. ఆచేరిక వాళ్ళని క్రమక్రమంగా అనురాగ బందితుల్ని చేసింది.

ఎందరికో పునర్జన్మని ప్రసాదించిన ఆ అమృతమూర్తి, సింహాని అజ్ఞాత జీవిత వలయంనుంచి తప్పించి తనవాడిగా చేసుకోవాలని ఆశించింది, జయించింది. అతడ్ని తన భాగస్వామిగా ప్రపంచానికి పరిచయం చేసే శుభ ఘడియలో వాళ్ళ అనురాగ వల్లరిలో అపశృతి పలికింది.

ఎందరికో కన్నీటిని తుడిచిన ఆ స్నేహ హస్తానికి, ఆ సుతిమెత్తని మనసుకి ఊరట కలిగే రోజెప్పుడో...

చదివిన ప్రతి ఒక్కరికి ''వీడని నీడ''గా వెంటాడే నిజమైన ప్రేమకథకి కొత్త నిర్వచనం... వీడని నీడ!

పేజీలు : 200

Write a review

Note: HTML is not translated!
Bad           Good