వేడుక పాటలు - డాక్టర్‌ వి.ఆర్‌.రాసాని

చదువురాని శ్రమజీవులు, తమకోసం తమలాంటి అసంఖ్యాక జనంకోసం సృష్టించుకున్న సాహిత్యం జానపద సాహిత్యం. జానపదం అంటే పల్లెటూళ్ళు. జానపదులంటే పల్లీయులు. ఈ పల్లీయులకు సంబంధించిందే జానపద సాహిత్యం. ఇవి ఆశువుగా ఎప్పటికప్పుడు సృష్టించబడతాయి. ఒక తరం నుంచీ మరో తరానికి కేవలం నోటిద్వారానే అందివ్వబడతాయి. పల్లెల్లో జరుపుకునే జాతరలు, దేవరలు, పండుగలు, తిరునాళ్ళు వంటి జనబాహుళ్యం చేరే కార్యక్రమాలు. పెండిండ్లు, పేరంటాలు, సమర్తలు, సీమంతాలు వంటివి, గొబ్బి, జక్కి, చెక్కభజన, పలకల భజన. చిటితాళ భజన వంటి వినోదాలు - ఇవన్నీ వేడుకలే. ఆయా సందర్భాలలో పాడినవన్నీ వేడుక పాటలే. వీటివల్ల మన సంప్రదాయాలు, ఆనందాలు, మన కళలు, వీటి విశేషాల గురించి పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉంది.

అలా తెలియజేయడం కోసమే ఈ పుస్తకం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good